ప్రజారోగ్యానికి హానిచేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలి.
చేవెళ్ల, సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం): ప్రజారోగ్యానికి హాని కల్గిస్తున్న మెరైన్ ఫుడ్స్ అం డ్ ఫీడ్స్ కంపెనీపై సత్వర చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం అంతారం పరిధిలో ఉన్న మెరైన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ కంపెనీని గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. మాస్క్ వేసుకు ని కంపెనీలో కలియదిరిగి పరిశీలించా రు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెరైన్ ఫుడ్ అండ్ ఫీడ్స్ కంపెనీలో ముకుపుటాలదిరే దుర్వాసన వస్తోందన్నారు. ఇది కార్మికులతో పాటు స్థానిక ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఇలాంటి కాలుష్య కారక కంపెనీపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కంపెనీతో రైతులకు, ప్రజలకు ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగానూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయించాల ని గ్రామస్తులు, రైతులు ఈ సంద ర్భంగా ఎమ్మెల్యేను కోరారు. కంపెనీ విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరమే చర్యలు తీసుకునేలా చూస్తానని రైతులకు, గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్యాదవ్, గ్రామస్తులు, రైతులు ఉన్నారు.
