ఎమ్మెల్యేగాంధీపై హత్యాయత్నం కేసు నమోదు?
హైదరాబాద్ సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసునమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరికెపూడి గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైనా గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌గౌడ్ లపైనా కూడ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.. ఘటనపై ఎస్ఐ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రో జుల క్రితమే ఒక కేసు నమో దు చేశారు. పోలీసులు. ఆ కేసులో ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసును ఫైల్ చేశారు. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల మధ్య మూడు రోజులుగా వివా దం చెలరేగుతున్న విష యం తెలిసిందే. గురు వారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగ గా.. జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీని ౩౦ మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయక పోయినా తాజాగా సెక్షన్ 307ని కూడా చార్జ్ షీట్‌లో నమోదు చేశారు..
