ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిస్తున్న శేఖర్ అభినందనీయుడు.
-మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ గుప్తా
-విద్యార్థులు నీళ్లు త్రాగెందుకు వాటర్ ఫిల్టర్ అందజేత
చేవెళ్ల సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం): దామరగిద్ద ప్రభుత్వ పాఠశాలకు దాత ఘనాపురం శేఖర్ చేయూతనివ్వడం అభినందనీయమని మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ గుప్తా అన్నారు. శనివారం చేవెళ్ల మండలం దామరగిద్ద లో ప్రాథమికొన్నత పాఠశాల లో విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ ను కాంగ్రెస్ పార్టీ ఓబీసి సెల్ మండల ఉపాధ్యక్షులు ఘానాపురం శేఖర్ తన తండ్రి బాలయ్య చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులకు, పాఠశాల అభివృద్ధికి చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్న దాత ఘానాపురం శేఖర్ ను కొనియాడారు. గతంలో కూడా వాల్ బోర్డులను, వాటర్ డబ్బాలను అందించినట్లు తెలిపారు. ఇలాగే ప్రతి ఒక్కరూ పాఠశాల కు చేయూత నిచ్చేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాను ఎప్పుడు ముందుంటాను అని శేఖర్ అన్నారు. గ్రామస్తులు శేఖర్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సంగీత, ఉపాధ్యాయులు ఆంజనేయులు, కిరణ్, సుమజ గ్రామానికి చెందిన ఎర్రవల్లి మల్లేష్, తెలుగు అంజయ్య, దర్శన్, రాములు, యాదయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.