నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు,జిల్లా ఆర్డిఓ,ఆర్మూర్ ఆర్డీవోకు వినతి పత్రం.
-మేము గోసంగిలమా బేడబుడగ జంగళ్లమా..
-త్వరలో డి,ఎల్,ఎస్,సి కమిటీ ద్వారా నిర్ధారణ చేయాలి.
-ఎస్సీ ఉప కులాల రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న.
నిజామాబాద్ సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే నిజామాబాద్ ఆర్డిఓ మరియు ఆర్మూర్ ఆర్డీవోను కలిసి వినతి పత్రాన్ని ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి,ఎల్,ఎస్,సి కమిటీ ద్వారా మేము గోసంగిలమా బేడబుడగ జంగళ్లమ నిర్ధారణ చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని గత 30 సం” పై నుండి గోసంగి కులంపై ప్రభుత్వ జీవో ప్రకారం కులం సర్టిఫికెట్లు పొందుచున్నాము. మా యొక్క వృత్తి యాచక వృత్తి (బెగ్గర్) గ్రామాలలో సంచరిస్తు కథలు వివిధ కళారూపాలు ద్వారా భిక్షాటని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాము. మా యొక్క మహిళలు ఈత కమ్మలతో చాపలు అల్లుతు ఉపాధి పొందేవారు. ప్రస్తుతం మేము నిజమైన గోసంగిలము అంటూ మాపై అనేక విధాలుగా మీడియాపరంగా పత్రిక వరంగా, ప్రభుత్వ అధికారలకు కలెక్టర్ చాలాసార్లు వారు నిజమైన గోసంగిలు కారు మీరు (బేడ బుడగ జంగాలు) అంటున్నారు. కావున మీరు మాపై దయ ఉంచి మేము నిజమైన గోసంగిలమా! బేడ బుడిగ జంగాళ్లమా! అని నిజ నిర్ధారణ కమిటీ వేసి నిర్ధారణ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము, పెళ్లిళ్లు అన్ని బేడ బుడగ జంగాళ్లతో అనుబంధంతో కూడుకున్నది, మా చుట్టరికం, బంధుత్వం ఇంటిపేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి గంధం చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం రాజు తదితరులు ఉన్నారు.