రాష్ట్రంలో ప్రభుత్వ దావకానాలలో అధ్వానంగా తయారైన పరిస్థితి.
వికారాబాద్ సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా పరిస్థితులపైన అధ్యయనం కోసం కేటీఆర్ ఏర్పాటుచేసిన త్రీ సభ్య కమిటీ చైర్మన్ తాటికొండ రాజయ్య కల్వకుంట్ల సంజయ్ వికారాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్. మెతుకు ఆనందును నియమించడం బి. ఆర్.ఎస్. పార్టీ నాయకులు పడిగళ్ళ అశోక్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పరిశుభ్రత పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వం హాస్పిటల్ లో గౌరవం పెంచిన కేసీఆర్ చేసిన కృషి అంతా ఇప్పుడొచ్చినా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటాలను గాలికి వదిలేసి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అన్నారు. ఇటీవల కాలంలో గాంధీ ఉస్మానియా హాస్పిటల్ లో తరచుగా చిన్నపిల్లలు వైద్యం వికటించి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రభుత్వ మెయింటినెన్స్ లేకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుందని అన్నారు. రాజకీయంగా నిత్యం కెసిఆర్ కేటీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటలపైన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు..