Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

స్వ‌చ్ఛ‌త హీ సేవ – 2024 కార్య‌క్ర‌మం.

స్వ‌చ్ఛ‌త హీ సేవ – 2024 కార్య‌క్ర‌మం.

-అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఐపీఎస్ మరియు అధికారులు, సిబ్బంది పరిసరాలు పరిశుభ్రం చేశారు.*మ

-స్వ‌చ్ఛ‌త హీ సేవ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో పరిశుభ్రత నిర్వహించిన జిల్లా పోలీసులు.

అనకాపల్లి, సెప్టెంబ‌ర్ 21(ప్రజాక్షేత్రం):స్వ‌చ్ఛ‌త హీ సేవ – 2024 కార్య‌క్ర‌మంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయ ప‌రిస‌రాల్లో జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్ గారు ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అలాగే జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్వ‌చ్ఛ‌త హీ సేవ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో పరిశుభ్రత నిర్వహించిన జిల్లా పోలీసులు. శనివారం ఉద‌యం స్వ‌చ్ఛ‌త హీ సేవ స‌మైక్య‌తా కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా ఎస్పీ కార్యాలయ ప‌రిస‌రాల్లోని చెత్త‌ను తొలగించి అధికారులు మరియు సిబ్బంది అంద‌రిలో స్ఫూర్తిని నింపారు. పిచ్చి మొక్కలు, గడ్డి, ప్లాస్టిక్ క‌వ‌ర్లు, తొల‌గించి చెత్తను తొట్టెలో వేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి నెలలో ఒక రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎం.దేవ ప్రసాద్, డీఎస్పీలు శ్రీ పి.నాగేశ్వరరావు, ఏవో శ్రీమతి బి.శారద, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ మూర్తి, బాల సూర్యారావు, వినోద్ బాబు, సతీష్, ఎస్సై ఆదినారాయణ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts