పిడిఎస్ యు అర్థ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి.
-50 ఏళ్లలో విద్యార్థి సమస్యలపై ఎనలేని పోరాటం చేసిన పిడిఎస్ యు.
-ఏ సంఘానికి లేని త్యాగాల చరిత్ర పిడిఎస్ యు విద్యార్థి సంఘానికి ఉంది.
-పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజేష్.
చేవెళ్ల సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం): సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 23 వరకు జరిగే పీడీఎస్ యు అర్ధ శతాబ్ది ఉత్సవాలని విజయవంతం చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాజేష్ పిలుపునిచ్చారు. పిడిఎస్ యు అర్ధ శతాబ్ది ఉత్సవ సభ వాల్ పోస్టర్స్ ని చేవెళ్ల మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల పిడిఎస్ యు విప్లవ ప్రస్థానంలో అనేకమంది విద్యార్థి రత్నాలు బిగి పిడికిలి జెండా కోసం తమ ప్రాణాలు తృణ పాయం చేశారని కామ్రేడ్ జార్జి రెడ్డి మతోన్మాద కత్తిపోట్లకి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నేల కొరిగాడని కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ , శ్రీపాద శ్రీహరి నాటి ఎమర్జెన్సీ చీకట్లో నాటి నియంతృత్వ పాలకుల తుపాకి తూటాలకు తమ ప్రాణాలని అర్పించారని కోలా శంకర్, చేరాలు, రంగవల్లి స్నేహాలత, మారోజు వీరన్న మధుసూదన్, రాజు యాదవ్, యానాల వీరారెడ్డి, రమణయ్య, సాంబన్న, లాంటి ఎందరో వీరులు తమ విలువైన ప్రాణాలని ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఇచ్చి సంస్థని సమున్నతంగా నిలబెట్టారని అన్నారు. ఏ విద్యార్థి సంఘంకి లేని త్యాగాల చరిత్ర పీడీఎస్ యు సంస్థకి ఉన్నదని తెలియజేశారు. ధ్వసం అవుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి విద్యా కార్పొరేటికరణకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్నీ రద్దు కోసం పిడిఎస్ యు అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తోంది. అని పిడిఎస్ యు పోరాట స్ఫూర్తిని వివరిస్తూ అమరవీరుల ఆశయాలని ఎత్తిపడుతూ సంస్థ ఆవిర్భవించి 50 ఏండ్లు అయిన సందర్భంగా విద్యార్థి విద్యార్ధినిలు అధిక సంఖ్యలో పాల్గొని సభలు సమావేశాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు డివిజన్ అధ్యక్షుడు కొజ్జంకి జైపాల్, డివిజన్ సహాయ కార్యదర్శి పంబాలి ప్రభాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.