Praja Kshetram
తెలంగాణ

ఈ నెల 25న కులగణనపై బీసీల రాష్ట్ర విసృతస్థాయి సమావేశం.

ఈ నెల 25న కులగణనపై బీసీల రాష్ట్ర విసృతస్థాయి సమావేశం.

-హాజరుకానున్న పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్.

-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.

హైదరాబాద్ సెప్టెంబర్ 24(ప్రజాక్షేత్రం):ఈ నెల 25న సమగ్ర కులగణనపై హైద్రాబాద్ లోనీ బేగంపేటలో ఉన్న టూరిజం ప్లాజా హోటల్ లో ఉదయం 10 గంటల నుండి బీసీల రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విస్తృతస్థాయి సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 25న రేపు ఛలో హైదరాబాద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంఘాలతో చర్చించి ఛలో హైదరాబాదును వాయిదా వేయాలని కోరడం జరిగిందన్నారు. దీనితో బుధవారం జరిగే కులగనన మార్చ్ ను బీసీల రాష్ట్ర విసృతస్థాయి సమావేశంగా మార్చామన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా పిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. అత్యంత కీలకంగా జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని బీసీ మేధావులు, వివిధ బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు హాజరు కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Related posts