మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన : మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సెప్టెంబర్25(ప్రజాక్షేత్రం):మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూ”లకు తెర లేపిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.తమ హయాంలో హైదరాబాద్‌ను మురికి నీటి రహి త నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ మురుగు శుద్ధి కేంద్రంలను ప్రారంభించామని బిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్, కూకట్ పల్లి, మురుగు నీటి శుద్ధి కేంద్రంన్ని ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి బుధవారం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. హైదరాబాద్ మహా నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ కసంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే 20 కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ. 4 వేల కోట్లతో 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే ఈ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శిం చారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. తమ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ.3,866 కోట్లతో మురు గునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటోందని ఎద్దేవా చేశారు.