Praja Kshetram
తెలంగాణ

శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్.. 300 మంది విద్యార్థులకు అస్వస్థత.

శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్.. 300 మంది విద్యార్థులకు అస్వస్థత.

 

 

హైదరాబాద్‌ సెప్టెంబర్ 27 (ప్రజాక్షేత్రం):శేర్లింగంపల్లి మాదాపూర్ శ్రీ చైతన్య అక్షర క్యాంపస్ లో 300 విద్యార్థులు తీవ్రమైన ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ లోని అక్షర క్యాంపస్ లో 60 పైగా విద్యార్థులు ఉంటున్నారని, గత రెండు రోజులుగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, వైరల్ ఫీవర్ లుగా ఉండడంతో చాలామంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. గత కొద్దిరోజులుగా చాలామంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. దినికి తోడు ఫుడ్ పాయిజన్ కావడంతో చాలామంది విద్యార్థులు రూమ్లకే పరిమితం అయ్యారని తోటి విద్యార్థులు తెలిపారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం అందివ్వడం లేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలేజ్ ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Related posts