బీసీ కుల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్స్ కల్పించాలి
–బీసీ కమిషన్ ను కోరిన చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ.
హైదరాబాద్ సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):సోమవారం ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులను చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకత్వం కలిసి వృత్తిదారులు, బీసీల సమస్యల గురించి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే కులగణన చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఎంబీసీలకు అవకాశం కల్పించే విధంగా ఏ, బి సి డి వర్గీకరణ చేయాలని చెప్పారు. చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలో ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. కమిషన్ సభ్యులు గౌరవనీయులు సురేందర్, జయప్రకాష్, రంగు బాలలక్ష్మి , మాట్లాడుతూ మేము చిత్తశుద్ధితో పని చేస్తామని అందుకు అన్ని సంఘాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ యం.వి. రమణ, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నర్షిహ్మ,రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకట నరసయ్య, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అమీర్ పెట్ మల్లేష్, విశ్వకర్మ వృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కుమారస్వామి, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగ్నేష్, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.