Praja Kshetram
తెలంగాణ

జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్.

జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్.

 

ఆరవ తేదీ నుంచి 10 వరకు మంజూరు.

రాజేంద్రనగర్, అక్టోబర్ 03(ప్రజాక్షేత్రం):కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల ఆరవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. తిరు సినిమాలో ‘మేఘం కరిగేనా’ అనే పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా నేషనల్ అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అవార్డు అందుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేశారు. ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు అత్యాచారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Related posts