Praja Kshetram
తెలంగాణ

హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్‌ విడుదల చేసిన సర్కార్.

హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్‌ విడుదల చేసిన సర్కార్.

 

హైదరాబాద్‌ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం): హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం గెజిట్‌ విడుదల చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చట్టంలో సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో సర్కార్ గెజిట్‌ రిలీజ్ చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తులు జలాశయాలు, రోడ్డు, పార్కులు, ఇతర ఆస్తులు కాపాడే బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు.

Related posts