పవన్ పై మరోసారి సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్..
హైదరాబాద్ అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లతో పాటు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే, మరొక డిప్యూటీ సీఎం మాత్రం సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. తమది సమానత్వమని, తాను ప్రశ్నిస్తే భయపడుతున్నారని అన్నారు. అయితే, తాను ఎన్నటికీ బలహీన వర్గాల తరఫునే మాట్లాడతానని, ప్రశ్నిస్తానని చెప్పారు.