Praja Kshetram
తెలంగాణ

ఆలూర్ గ్రామంలో హలాల్ నిషేధం

ఆలూర్ గ్రామంలో హలాల్ నిషేధం

 

–హిందూ దేవుళ్ళ వద్ద హలాల్ వద్దు.

–గ్రామంలో మత్తు పదార్థాలు సేకరించినట్లయితే కఠిన చర్యలు తప్పదు.

నిజామాబాద్ అక్టోబర్:07(ప్రజాక్షేత్రం): నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో నూతన వీడీసీ సభ్యులు చర్చించుకొని ఆలూర్ లో అన్ని గ్రామ దేవతల వద్ద హలాల్ ను నిషేధిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ సోమవారం తీర్మానించారు. ప్రతి ఒక్కరూ దీనికి గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.అలాగే గంజాయి కి యువత బానిసవ్వడంతో యువకుల భవిష్యత్తు నాశనం అవుతుంది అందువలన మన గ్రామంలో కూడా ఎవరైనా యువకులు ఈ మత్తు పదార్థాలకు బానిస అయినట్లయితే వారిని మరియు ఈ గంజాయి విక్రయిస్తున్న వారిపై కచ్చితంగా పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకుంటామని అధ్యక్షులు బార్ల ముత్యం ఉపాధ్యక్షులు తిరుమనపల్లి నవనీత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎత్తిన సంతోష్, కోశాధికారులు కేసు పెళ్లి గంగారెడ్డి, కామని సుమన్,గంధం రాములు, బంజ జాన్, కళ్లెం మల్లేష్, మగ్గిడి గంగారెడ్డి,ముక్కెర భాస్కర్, ఉంగరాల రాజేందర్,అశోక్,నాగేష్, తదితరులు వీడిసి సభ్యులు తీర్మానం చేశారు.

Related posts