జీతాలు చెల్లించాలని ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు.
నిర్మల్ అక్టోబర్ 08(ప్రజాక్షేత్రం):ఎనిమిది నెలలుగా జీతాలు లేవు. ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చివరికి పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. నెలల తరబడి జీతాలు రాకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.