Praja Kshetram
తెలంగాణ

సంకేపల్లి లో పిచ్చి కుక్కల స్వైర విహారం

సంకేపల్లి లో పిచ్చి కుక్కల స్వైర విహారం.

 

-పట్టించుకోని సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్.

శంకర్ పల్లి అక్టోబర్ 13(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.పిచ్చి కుక్కలు వేరే కుక్కల మీద, ప్రజలపై దాడులు చేస్తున్న ఎవరు పట్టించుకోవటం లేదు. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ పాలన లేకపోవటంతో పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది అని గ్రామస్తులు అంటున్నారు . ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ ని నియమించినా ఆయన 6 నెలలకు ఒక్క సారి కాని కనిపించే పరిస్థితి లో లేదు. కుక్కల బెడదా చాలా తీవ్రంగా ఉంది అని గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నారు.అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Related posts